యువతిని వెంబడించి.. కొమ్ములతో పొడిచిన ఎద్దు(వీడియో)

67చూసినవారు
ఓ యువతిని వెంబడించిన ఎద్దు కొమ్ములతో దారుణంగా పొడిచింది. ఈ ఘటనకు సంబబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువతి, యువకుడు బైక్ మీద వస్తున్నారు. ఈ క్రమంలో వారిని ఓ ఎద్దు వెంబడించింది. అయితే భయంతో వారు బైక్ ని ఆపారు. దాంతో బైక్ పై ఉన్న యువతి దిగి పారిపోగా ఆమెను ఆ ఎద్దు వెంటపడి మరీ పొడిచింది. స్థానికులు గమనించి ఎద్దును దూరం కొట్టి ఆమెను కాపాడారు. అయితే ఈ ఘటన ఈ నెల 16న జరగగా.. ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్