‘వైజయంతీ మూవీస్‌’కు ఆ పేరు పెట్టింది ఆయనే!

65చూసినవారు
‘వైజయంతీ మూవీస్‌’కు ఆ పేరు పెట్టింది ఆయనే!
‘వైజయంతీ మూవీస్‌’ బ్యానర్‌లో ఎన్నో హిట్ చిత్రాలను అశ్వనీదత్‌ తెరకెక్కించారు. కాగా.. ఈ సంస్థకు ఆ పేరు పెట్టింది సీనియర్ ఎన్టీఆర్. అశ్వనీదత్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తొలి సినిమా ‘ఎదురులేని మనిషి’ ప్రారంభమైంది. కాల్షీటుపై సంతకం పెడుతూ, ‘సంస్థకేం పేరు పెట్టారు’అని ఎన్టీఆర్ అడగగా..మీరే చెప్పండి అని దత్ అన్నారు. కృష్ణుడి మెడలో ఉన్న వైజయంతిమాలకు గుర్తుగా ‘వైజయంతీ మూవీస్‌’అని ఎన్టీఆర్‌ పేరు పెట్టారు.

సంబంధిత పోస్ట్