ఎన్నికలు సమీపిస్తున్న వేళ యువతను ఆకట్టుకునేందుకు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఇటీవల యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తామేమీ తక్కువ కాదన్నట్టు ఓ బీఆర్ఎస్ ఎంపీ కూడా ఈ ఆఫర్‌ను ప్రకటించారు. యువతీ, యువకులకు డ్రైవింగ్ లైసెన్స్‌లను తమ సొంత ఖర్చులతో ఉచితంగా ఇప్పిస్తామని బీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. లైసెన్స్‌తో పాటు హెల్మెట్ కూడా ఉచితంగా అందిస్తామని చెప్పారు.