నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్​ రద్దు చేస్తాం: మంత్రి పొన్నం

50చూసినవారు
నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్​ రద్దు చేస్తాం: మంత్రి పొన్నం
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకు వస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, సిగ్నల్ జంప్ చేసినా, ఇతరత్రా నిబంధనలు ఉల్లంఘించినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ ఇలాంటి చర్యలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తామని అన్నారు. మోటారు వాహన చట్టానికి విరుద్దంగా తిరుగుతున్న 6,936 వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్​లను రద్దు చేసినట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్