దేవదాసు, ప్రేమాభిషేకం సినిమాల్లో హీరో మరణించినా ప్రేక్షకులు వాటికి బ్రహ్మరథం పట్టారు. ప్రణయ భావాల్ని, విషాదాల్నీ పలికించడం ఎవరికైనా సులువే. కానీ, వైరాగ్యాన్నీ, వేదాంతాన్నీ కలగలిపి పలికించడం అంత సులువేం కాదు. కళ్లు ఏడుస్తుంటే, పెదాలు నవ్వడం ఏకకాలంలో జరగాలి మరి! అలాంటి కష్టసాధ్యమైన హావభావాల్ని అలవోకగా, అద్భుతంగా పండించిన అసామాన్యుడు అక్కినేని. అందుకే భగ్న ప్రేమికుడి పాత్రలకు "ఆలంబనగా, తాగుబోతు పాత్రలకు చిరునామాగా నిలిచారు అక్కినేని.