TG: ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌పై విపక్ష సభ్యుడు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఆయన నిలదీశారు. రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారని.. ఈ బడ్జెట్లో కేవలం రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లుగా చూపించారని అన్నారు. రైతు భరోసా పథకం పేరు మార్చేశారు కానీ.. డబ్బులు ఇవ్వలేని అన్నారు.