తెలంగాణలో డ్రైపోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్‌

57చూసినవారు
తెలంగాణలో డ్రైపోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్‌
రవాణా రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు CM రేవంత్ పిలుపునిచ్చారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం, CII, హీరో మోటార్‌ కార్ప్‌ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో CM పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో డ్రైపోర్టును నిర్మించి వేర్‌హౌజ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చేందుకు డ్రై పోర్టుకు సమీపంగా ఉండే మచిలీపట్నం పోర్టుకు ప్రత్యేకంగా రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్