డ్వాక్రా మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: డిప్యూటీ సీఎం (వీడియో)

73చూసినవారు
డ్వాక్రా సంఘాల మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. సోలార్ విద్యుత్తు ఉత్పత్తిలో అంబానీ, ఆదానీలను కాకుండా.. తెలంగాణ మహిళలను సోలార్ ప్లాంట్స్ ఏర్పాటులో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు వ్యాపారవేత్తలుగా మారడంలో తెలంగాణ దేశానికే మోడల్ కాబోతోందన్నారు.

సంబంధిత పోస్ట్