UN మీటింగ్‌లో భూకంపం (వీడియో)

571చూసినవారు
న్యూయార్క్ ప్రాంతంలో శుక్రవారం భూకంపం సంభవించింది. దీంతో ఐక్యరాజ్యసమితి (UN) భద్రతా మండలి సమావేశానికి కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఐక్య రాజ్య సమితి దౌత్యవేత్తలు గాజాలో పరిస్థితిపై సమావేశానికి భద్రతా మండలి ఛాంబర్‌లో ఉన్నారు. ఆ సమయంలో భూమి కంపించింది. దీంతో దౌత్యవేత్తలు ఆందోళనకు గురయ్యారు. సమావేశం ఒక్కసారిగా నిశ్శబ్ధంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్