ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన రోజునే భారత్ నిజమైన స్వాతంత్య్రాన్ని పొందిందని మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై మమతా బెనర్జీ స్పందింస్తూ.. ఇది దేశ చరిత్రను వక్రీకరించడానికి ఆర్‌ఎస్‌ఎస్ పన్నుతున్న పథకమని విమర్శించారు. దేశాన్ని మతం ఆధారంగా విభజించాలని చూస్తే తాము ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు.