మఖానా, పాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ మఖానా పాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. ఇంకా నిద్ర సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు తగ్గి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది. మఖానాను పాలతో మరిగించి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.