ఎస్సీల విషయంలో ఏపీ సీఎం జగన్ మాట తప్పి.. మడమతిప్పారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై జగన్ తన వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. YCPలో మాలల ఆధిపత్యంకోసం మాదిగలను అణగదొక్కుతున్నారని అన్నారు. జగన్ అభిప్రాయాన్ని ఆదిమూలపు సురేష్‌తో చెప్పించారా అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమే అని సుప్రీం చెప్పిందని, CM చంద్రబాబుకి నిజాయితీ, చిత్తశుద్ధి ఉందని మందకృష్ణ ప్రశంసలు కురిపించారు.