ఎగ్జిట్ పోల్స్‌పై EC కీలక ఆదేశాలు

25739చూసినవారు
ఎగ్జిట్ పోల్స్‌పై EC కీలక ఆదేశాలు
ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీనిపై వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలకు ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రజాప్రాతినిథ్య చట్టం 126 ఏ (1) నిబంధనలను అంతా పాటించాలని సూచించింది. ఏడో విడత పోలింగ్ శనివారం (జూన్ 1)న జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి.

సంబంధిత పోస్ట్