వృద్ధ వ్యాపారిని దారుణంగా కొట్టాడు (వీడియో)

52చూసినవారు
యూపీలోని జౌన్‌పూర్ తాజాగా దారుణం జరిగింది. ఓ వృద్ధ వ్యాపారి రోడ్డుపై బ్రతుకుతెరువు కోసం కూరగాయలు అమ్ముతున్నాడు. అయితే ఒక వ్యక్తి అతని వద్దకు నిత్యం వచ్చి కూరగాయలు అప్పుగా కొనుక్కునేవాడు. ఎప్పటిలాగే అతను వృద్ధుడి వద్దకు వచ్చి కూరగాయలు ఇవ్వమని కోరగా.. బాకీ డబ్బులు ఇస్తేనే ఇస్తానని పెద్దాయన నిరాకరించాడు. దీంతో ఆ వ్యక్తి ఆగ్రహానికి గురై కిందపడేసి దారుణంగా కొడతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్