గుండెపోటుతో కుప్పకూలి వృద్ధుడు మృతి (VIDEO)

70చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విషాదం చోటుచేసుకుంది. బాబన్ పయేగా ప్రాంతంలోని మునీర్ బేగ్ అనే వృద్ధుడు మందుల కోసం ఓ క్లినిక్‌ వద్దకు వెళ్లాడు. మందుల దుకాణం తెరవకపోవడంతో అక్కడే ఉన్న ఓ బల్లపై వృద్దుడు కూర్చొన్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చి అక్కడే నేలపై పడిపోయాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్