భార్యాభర్తలను విడదీసిన ఎన్నికలు

1059చూసినవారు
భార్యాభర్తలను విడదీసిన ఎన్నికలు
లోక్‌సభ ఎన్నికలు ఓ దంపతుల మధ్య చిచ్చు పెట్టాయి. మధ్యప్రదేశ్‌ బాలాఘాట్ నుంచి బీఎస్పీ తరుపున ఎంపీ అభ్యర్థిగా కంకర్ ముంజరే పోటీ చేస్తున్నారు. ఆయన భార్య అనుభా ముంజరే ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు పార్టీల తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదని భావించిన కంకర్ ముంజరే భార్యను వదిలి వేరే ఇంటికి వెళ్లిపోయారు. ఎన్నికలు పూర్తయ్యాకే తిరిగి ఇంటికి వస్తానన్నారు.

సంబంధిత పోస్ట్