ప్రభుత్వ హాస్పిటల్‌లో గోడలకు విద్యుత్ షాక్

58చూసినవారు
ప్రభుత్వ హాస్పిటల్‌లో గోడలకు విద్యుత్ షాక్
కామారెడ్డి జిల్లాలో విద్యుత్ షాక్ కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో ఫ్యామిలీ ప్లానింగ్ విభాగం గోడలకు విద్యుత్ సరఫరా కావడంతో పలువురు రోగులు విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది చికిత్స పొందుతున్న పేషెంట్‌లను మరో వార్డుకు షిఫ్ట్ చేశారు. నీరు స్లాబ్ గుండా గోడలకు చేరడంతో విద్యుత్ సరఫరా అయింది. ఎవరికి ప్రమాదం సంభవించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్