తెలంగాణలో వేసవిలో విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఉంటుందని డిప్యూటీ సీఎం, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. గురువారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త విద్యుత్ పాలసీ ద్వారా భారీగా పెట్టుబడులు రాబోతున్నట్టు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.