AP: తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద్యోగులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం విధుల్లో ఉన్న ఉద్యోగి బాలాజీపై టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ బూతులతో విరుచుకుపడ్డారు. దీంతో నరేశ్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఉద్యోగులు పట్టుబట్టారు. తమకు నరేశ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.