దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదో భయానక ఘటన అని, తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని కోరారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెంగాల్ ఘటనపై రాష్ట్రపతి స్పందించారు. అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజం అనుమతించదన్నారు.