ఈటల ఘాటు వ్యాఖ్యలు.. సీఎం రేవంత్‌పై విమర్శలు

80చూసినవారు
ఈటల ఘాటు వ్యాఖ్యలు.. సీఎం రేవంత్‌పై విమర్శలు
బీజేపీ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి సొంత అజెండాతో పని చేయవద్దని చెప్పారు. పనుల నిమిత్తం ముఖ్యమంత్రిని కలిస్తే దానికి చెడు ఉద్దేశాలు అపాదించవద్దున్నారు. పనుల నిమిత్తం ఏ రాజకీయ పార్టీ నేతలైనా సీఎంను కలిసే సంప్రదాయం ఉండాలన్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఆదివారం జరిగిన కృతజ్ఞతా సభలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్