రాజమౌళి 'ఈగ 2' చేసినా.. నాతో అవసరం లేదన్నారు: నాని

1051చూసినవారు
రాజమౌళి 'ఈగ 2' చేసినా.. నాతో అవసరం లేదన్నారు: నాని
'ఈగ' సీక్వెల్ గురించి దర్శకుడు రాజమౌళికి తనకు మధ్య జరిగిన సంభాషణను నాని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈగ సీక్వెల్ చేస్తానన్నారు కదా.. ఎప్పుడు మొదలెడదామని నేను రాజమౌళితో సరదాగా అన్నా దానికి ఆయన 'మేం ఈగ 2 చేసినా నీతో అవసరం లేదు. ఈగ ఉంటే చాలు. అదే సీక్వెల్లో తిరిగొస్తుంది' అని బదులిచ్చారని నాని చెప్పారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఈగ' రెండు జాతీయ అవార్డులు గెలుచుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్