అస్సాంలోని డెర్గావ్‌లో లచిత్ బర్ఫుకాన్ పోలీసు అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం తన విద్యార్థి జీవితాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. "అస్సాంలో హితేశ్వర్ సైకియా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి ఆందోళన నిర్వహించాం. అప్పట్లో నన్ను 7 రోజుల పాటు జైల్లో పెట్టారు. నా పట్ల కఠినంగా వ్యవహరించారు. నాపై భౌతికంగా దాడి చేశారు కూడా" అని అమిత్ షా అన్నారు.