విద్యార్థులకు స్వేచ్ఛను కల్పించేది త్రిభాషా విధానమని జనసేన పార్టీ పేర్కొంది. "భారతీయులను ఒక్కటిగా చేసేది త్రిభాషా విధానం, మన సంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకునేందుకు వారధి త్రిభాషా విధానం. ఇది అర్థం చేసుకోలేని కొంతమంది, పవన్ కళ్యాణ్ అప్పుడు ఒకలా, ఇప్పుడు ఒకలా మాట్లాడారు అని అనడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనం." అని జనసేన 'ఎక్స్' వేదికగా శనివారం ట్వీట్ చేసింది.