కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నోళ్లు అంతా జైలు పక్షులే అని అద్దంకి దయాకర్ ఆరోపణలు చేశారు. మంగళవారం ప్రముఖ మీడియా ఛానల్లో ఆయన మాట్లాడుతూ.. "ఏసీబీ ముందుకు వచ్చి ఆయన వెర్షన్ ఏంటో చెప్పుకోవడానికి కేటీఆర్ కు ఎందుకు అంత ఈగో అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావు కూడా అవినీతికి పాల్పడ్డారు. అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని షేవ్ చేయమని కాదు. వాళ్లు రూ.లక్షల కోట్లు సంపాదించారు కాబట్టి రూ.55 కోట్లు అంటే లెక్క లేదు." అని అన్నారు.