వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. జగన్‌కు ఐదేళ్ల వ్యవధికి పాస్‌పోర్ట్ మంజూరుకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 20న జగన్ పాస్‌పోర్టు గడువు ముగిసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టుకు ఎన్ఓసీ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఊరట లభించింది.