నార్త్ ఇండియాలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల సేవలకు ఆంటంకం కలుగుతోంది. దేశ రాజధానిలో ప్రతికూల వాతావరణం కారణంగా మంగళవారం 300 విమానాలు ఆలస్యంగా నడిచినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, సాయంత్రం నుంచి దృశ్యస్పష్టత మెరుగుపడిందని, దీంతో అన్ని విమానాలు సాధారణంగానే రాకపోకలు సాగిస్తున్నాయని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (DIAL) పేర్కొంది. విమానాల అప్‌డేటెడ్ సమాచారం కోసం ఆయా ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించింది.