గుజరాత్‌లోని కచ్‌లో రాధిక జ్యువెలర్స్ యాజమానికి చెందిన షాపుతో అతని ఇంటిపై నకిలీ ఈడీ అధికారులు దాడులు చేశారు. మొత్తం 12 మంది ఈడీ అధికారులమంటూ దాడులు చేశారు. అకౌంట్ల వివరాలు చెప్పాలని, లేదంటే జైలుకు పంపుతామని హడావుడి చేసి చివరకు రూ. 25 లక్షల విలువైన బంగారం, వెండి నగలు, నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు. యజమాని తర్వాత గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా 10 బృందాలుగా గాలించి నిందితులను అరెస్టు చేశారు.