గుజరాత్‌లోని బనాస్కాంఠా జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిరోహి వైపు వెళ్తున్న బస్సును రాంగ్ రూట్‌లో వచ్చిన బోలేరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులు, ఇద్దరు కొడుకులు, మరో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ప్రమాదంలో బోలేరో పూర్తిగా ధ్వంసం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్నారు.