పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్‌ను పోలీసులు విచారించనున్నట్లు సమాచారం. క్రిప్టో కరెన్సీ కంపెనీ కార్యక్రమాల్లో తమన్నా, కాజల్ పాల్గొన్నారు. ఆ తర్వాత ముంబయిలో పార్టీ నిర్వహించిన సదరు సంస్థ వేలాది మంది నుంచి డబ్బు సేకరించినట్లు గుర్తించారు. ఈ కేసులో నితీష్ జెయిన్, అరవింద్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇద్దరు హీరోయన్లను విచారించాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.