ఘోర రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి సహ ఒకరు మృతి

58చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి సహ ఒకరు మృతి
AP: పల్నాడు జిల్లా వెల్దుర్తిలోని పెట్రోల్ బంక్ సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ట్రాక్టర్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో.. ఆ ట్రాక్టర్ ను వెనకాలే వచ్చిన ఓ బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారితో పాటు 30 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్