UPలోని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. గురువారం రాత్రి వారు వెళ్తున్న వ్యాన్‌పై టయోటా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 11మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సంతాపం తెలిపారు.