ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లపై వరాలు కురిపించారు. ఆఆటో డ్రైవర్లకు ఐదు కీలక హామీలను ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్ కూతురి పెళ్లికి రూ.లక్ష సాయం ఇస్తామని తెలిపారు. అదే విధంగా ప్రతి దీపావళి, హోలీకి రూ.2,500, ఒక్కో ఆటోడ్రైవర్‌కు రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని వెల్లడించారు.