జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య

52చూసినవారు
జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య
AP: భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఖైదీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లా జైలులోని మహిళా బ్యారక్‌లో జరిగింది. తాటకులగూడేనికి చెందిన గంధం బోసుబాబు హత్య కేసులో పోలీసులు ఆయన భార్య శాంత కుమారి (31), ఆమె ప్రియుడు సొంగా గోపాలరావును అరెస్ట్ చేశారు. శాంత కుమారిని మహిళా బ్యారక్‌లో ఉంచారు. అయితే బాత్‌రూమ్‌ కిటికీకి చున్నీ కట్టుకుని ఉరేసుకున్నారు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్