AP: పాస్టర్ ప్రవీణ్ మిస్టరీ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. కోదాడ, ఏలూరు మధ్యలోని ఓ వైన్ షాప్‌లో ప్రవీణ్ మద్యం కొనుగోలు చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. దీంతో ప్రవీణ్ మద్యం సేవించి బైక్ నడిపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ప్రమాదానికి ముందే ఆయన బైక్ హెడ్ లైట్ పగిలి ఉన్నట్లుగా తెలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.