IPL-2025: 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కి తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. జొఫ్రా ఆర్చర్ వేసిన 4వ బంతికి రచిన్ రవీంద్ర పరుగులేవి చేయకుండానే వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో మొదటి ఓవర్‌లో చెన్నై పరుగులేవి చేయకపోగా.. ఒక వికెట్ కోల్పోయింది.