బెంగాల్‌లో హింస.. సినీనటుడు రోడ్‌ షోపై రాళ్ల దాడి!

76చూసినవారు
బెంగాల్‌లో హింస.. సినీనటుడు రోడ్‌ షోపై రాళ్ల దాడి!
పశ్చిమబెంగాల్‌లో మరో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. సినీ నటుడు, బీజేపీ నేత మిథున్‌ చక్రవర్తి మిడ్నాపుర్ పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. అయితే అతను క్షేమంగానే ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌ తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ ఘర్షణ జరిగింది. అయితే తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలే ఈ దాడి చేశారని అగ్నిమిత్ర పాల్‌ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్