తెలంగాణ మేడ్చల్ ఏఎస్‌రావు నగర్‌లోని హై స్ట్రీట్ రెస్టారంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా హై స్ట్రీట్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎంత వరకు ఆస్తి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది.