మహీంద్రా కారు షోరూంలో అగ్ని ప్రమాదం

82చూసినవారు
TG: హైదరాబాద్ కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి కొండపూర్ చౌరస్తా వద్ద ఉన్న మహీంద్రా షోరూంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నికి పలు కార్లు ఆహుతి అయినట్లు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. దీంతో ప్రధాన రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్