మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పూణెలోని పింప్రి-చించ్వాడ్ నగరంలోని ఔంద్-రావెట్ రహదారిపై ఆదివారం ఉదయం బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.