కొన్ని రోజులుగా చండీగఢ్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మనుషులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లగలిగినప్పటికీ, జంతువుల పరిస్థితి దీనావస్థలో ఉంది. భారీ వర్షం కారణంగా వంతెన కింద చిక్కుకుపోయిన కుక్క సాయం కోసం ఎదురు చూసింది. ఖుదా లాహోర్ వంతెన కింద చిక్కుకుపోయిన కుక్కపిల్లను నగర పోలీసుల సహాయంతో చండీగఢ్ అగ్నిమాపక విభాగం బృందం రక్షించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.