ఏఐఎంఐఎం నేతపై కాల్పులు..!

69చూసినవారు
ఏఐఎంఐఎం నేతపై కాల్పులు..!
మాలేగావ్‌ మాజీ మేయర్‌, ఏఐఎంఐఎం నేత అబ్దుల్‌ మాలిక్‌ మహమ్మద్‌ యూనిస్‌పై ఇవాళ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు మూడు తూటాలు తగిలాయి. ఛాతి ఎడమ భాగం, కుడి తొడ, కుడి చేయికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర ఎంఐఎం శాఖలో అబ్దుల్‌ ప్రముఖ నాయకుడు. సోమవారం తెల్లవారుజామున 1.20 సమయంలో ఓల్డ్‌ ఆగ్రా రోడ్డులోని ఒక రెస్టారంట్‌ ఎదుట కూర్చొని ఉండగా ఈ దాడి జరిగినట్లు నాసిక్‌ పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్