భారత కోచ్‌ రేసులో ఫ్లెమింగ్.. స్పందించిన సీఎస్‌కే

75చూసినవారు
భారత కోచ్‌ రేసులో ఫ్లెమింగ్.. స్పందించిన సీఎస్‌కే
టీమిండియా హెడ్ కోచ్ పోస్టుకు బీసీసీఐ ఇటీవల దరఖాస్తుల్ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ పదవికి సీఎస్‌కే కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్ దరఖాస్తు చేసుకున్నారంటూ వచ్చిన వార్తలపై సీఎస్‌కే యాజమాన్యం స్పందించింది. తమకు అటువంటి సమాచారమేమీ లేదని, ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టి పారేసింది. ఒకవేళ ఫ్లెమింగ్ భారత కోచ్‌గా వెళ్లాలని భావిస్తే, నిబంధనల్ని అనుసరించి ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్