సాంకేతిక సమస్యతో విమానం జైపూర్‌కు మళ్లింపు

82చూసినవారు
సాంకేతిక సమస్యతో విమానం జైపూర్‌కు మళ్లింపు
ఇండిగో 6E784 విమానం సోమవారం రాజస్థాన్‌ జైపూర్‌ నుంచి పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాకు బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి అందులో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఓ ఇండిగో ప్రతినిధి తెలిపారు. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని వెంటనే జైపూర్‌కు మళ్లించినట్లు తెలిపారు. ఆ విమానం జైపూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు చెప్పారు. ఇక ప్రయాణికుల కోసం ప్రత్యేక ఫ్లైట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్