ఈనెల 15 (గురువారం)న పంద్రాగస్టు, 19న (సోమవారం) రక్షాబంధన్ కావడంతో ఒకట్రెండు అదనంగా సెలవులు పెట్టుకుంటే.. వరుసగా 5 రోజులపాటు సేద తీరే వీలుంది. దీంతో ఈ తేదీల్లో విమాన టికెట్లు, హోటళ్ల గదులకు బుకింగ్‌లు.. వాటి ధరల అధికమయ్యాయని మేక్‌మైట్రిప్ తెలిపింది. గోవా, పుదుఛ్చేరి, చిక్‌మంగళూరు, ఊటీ, ఉదయ్‌పూర్, వారణాసి, అమృత్‌సర్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి గమ్యస్థానాలకు గిరాకీ బాగా పెరిగిందని వెల్లడించింది.