పోటెత్తిన బ్రహ్మపుత్ర.. నీట మునిగిన గ్రామాలు

79చూసినవారు
అరుణాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అసోంలో వరద ఉధృతి కొనసాగుతోంది. రహదారులు, కమ్యూనికేషన్ల వ్యవస్ధ తీవ్రంగా దెబ్బతింది. ఇక మరిగావ్‌ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. వర్షాల కారణంగా అసోంలోని బ్రహ్మపుత్ర నది నీటిమట్టం పెరగడంతో నగాంవ్‌, డిబ్రుగఢ్‌ జిల్లాలు నీట మునిగాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్