మహా కుంభమేళా బుధవారంతో ముగియనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తించబడిన మహా కుంభమేళా నేడు ముగియనుండడంతో యూపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహా శివరాత్రిని పురస్కరించుకొని నేడు భారీగా భక్తులు తరలివస్తుండడంతో భక్తులపై హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. త్రివేణి సంగమం మొత్తం పూలమయం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.