మాజీ ఎమ్మెల్యే ఎన్‌.సుధాకర్‌రావు కన్నుమూత

70చూసినవారు
మాజీ ఎమ్మెల్యే ఎన్‌.సుధాకర్‌రావు కన్నుమూత
ఉమ్మడి వరంగల్‌ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌.సుధాకర్‌రావు(73) బుధవారం రాత్రి కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సుధాకర్‌రావు స్వస్థలం పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి. 1999 ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం (ప్రస్తుతం పాలకుర్తిలో అంతర్భాగం)లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2004 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్