ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేసిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

63చూసినవారు
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేసిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన సలహాదారు సయీద్ జుల్ఫీ భుఖారీ వెల్లడించారు. నామినేషన్ల దాఖలుకు ఆదివారంతో గడువు ముగియగా, ఖాన్ దానికి ముందే తన దరఖాస్తును సమర్పించారు. విశ్వవిద్యాలయంలో ఛాన్సలర్ అనేది గౌరవ హోదా. దీనికి ఎన్నికలు అక్టోబర్ లో జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్