తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రేపటి నుండి మొదలవుతున్న సందర్భంగా.. తమ పెండింగ్ బిల్లులపై చర్చించాలని, సమావేశాలు ముగిసేలోగా రూ.500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిసెంబర్ 8న అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల జేఏసీ పిలుపునిచ్చింది. గ్రామపంచాయతీల్లో ప్రభుత్వం బిల్లులు ఇస్తుందన్న నమ్మకంతో అప్పులు చేసి మరి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాని జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు.